పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి : ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు

by Thanuru Gopichand |

ఏపీలో పత్తి రైతులు (Cotton Farmers) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (MP Lavu Sri Krishna Devarayalu) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జరిగిన లోక్ సభ సమావేశంలో విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు.

పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి : ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పత్తి రైతులు (Cotton Farmers) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (MP Lavu Sri Krishna Devarayalu) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జరిగిన లోక్ సభ సమావేశంలో విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని రైతులు నష్టపోయారన్నారు. ముఖ్యంగా ఏపీలోని పత్తి రైతులు పంటను భారీగా నష్టపోయారని సభకు తెలిపారు. దాని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. తుఫాను ప్రభావంతో చాలా వరకు పంట రంగు మారిందన్నారు. అంతేకాకుండా పత్తి ఉత్పత్తిలో తేమ శాతం కూడా పెరిగిందన్నారు. అటువంటి వాటిని సైతం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఈ మేరకు ఆదేశాలను జారీ చేయాలని విన్నవించారు. అయితే పత్తి కొనుగోలును తక్షణమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ పత్తి రైతులను ఆదుకోని వారికి అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర మంత్రిత్వ శాఖ సమాధానాలు ఇచ్చింది. పల్నాడు జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పథకాల అమలు తీరు గురించి సంబంధిత కేంద్ర మంత్రి సమాధానాలు ఇచ్చారు. జిల్లాలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయన్నారు. నవంబరు 2025 నాటికి ఏకంగా 62,036 ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదయ్యాయని వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనా కింద పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు 7,350 మంది లబ్ధిదారులను గుర్తించగా వారిలో 54.5శాతం మహిళలు, 34.2 శాతం ఎస్సీలు, 14.7శాతం ఎస్టీలు ఉన్నారని పేర్కొన్నారు. పథకం కింద మంజూరైన 810 రుణాలను 757 పంపిణీ చేయడం జరిగిందని ప్రకటించారు. అయితే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం వినియోగం మెరుగు పడుతున్నప్పటికీ అనేక దరఖాస్తులు బ్యాంకు స్థాయిలో పెండింగ్ ఉన్న విషయాన్ని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు సభ దృష్టికి తీసుకొచ్చారు. పల్నాడులో ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వేగవంతమైన అనుమతులు, రుణాల పంపిణీ, క్లస్టర్ అభివృద్ధికి మద్ధతు ఇవ్వాలని కోరారు.

Next Story