- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటలో.. అవినీతి! చిక్కుల్లో మాజీ మహిళా మంత్రి?
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్రా' ( పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది.

ఒకట్రెండు రోజుల్లో డీజీపీకి నివేదిక
నాటి వైసీపీలో కీలక వ్యక్తులపై చర్యలకు అవకాశం?
చిక్కుల్లో మాజీ మహిళా మంత్రి!
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్రా' (Adudam Andhra) పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి (DGP) అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా (RK Roja) పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. 'ఆడుదాం ఆంధ్రా'లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను విజిలెన్స్ (Visilence) విభాగం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ పరిపాలన సాగించిన చివరి ఏడాదిలో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడలను నిర్వహించి.. అందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై విచారణకు ఆదే శించారు. ప్రభుత్వ కార్యక్రమం పేరోతో స్పోర్ట్స్ కిట్లు, యాప్, టీ - షర్టులు, బ్రోచర్లు, క్రీడల నిర్వహణ, రవాణా, ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ, ముగింపు రోజు ఏర్పాట్లు.. ఇలా మొత్తం రూ.119 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అప్పటి మంత్రి రోజా, నాటి శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి చెప్పిన వారికి వర్కర్ అర్డర్లు , నచ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా భారీగా వెనుకేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై విజిలెన్స్విచారణ చేపట్టింది. ఆడుదాం ఆంధ్రా లో చేసిన అవినీతి పై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని.. ఆగస్టు 10 తర్వాత మాజీ మహిళా మంత్రి ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావొచ్చన్నారు శాప్ ఛైర్మన్ రవినాయుడు గతనెలలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె అరెస్ట్ కోసం వారెంట్ కూడా రెడీ అవుతుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘ఆడుదాం ఆంధ్రా’లో జరిగిన స్కామ్‌పై నేడో.. రేపో విజిలెన్స్ విభాగం అధికారులు డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్విని యోగం మూలాలను వెలికితీసినట్టు సమాచారం. నివేదికలో అంశాల ఆధారంగా ప్రభుత్వం.. బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. రూ.119కోట్లతో వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీగా అవినీతి చోటు చేసుకుం దని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది. ఈ పరిణామాలు చూస్తే మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తునాయి. రానున్న రోజుల్లో పలు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.






