Nara Lokesh:‘మేం దారి తప్పితే.. సరిదిద్దండి’.. మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-21 09:50:39  IST  )

రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) దూసుకెళ్తోంది.

Nara Lokesh:‘మేం దారి తప్పితే.. సరిదిద్దండి’.. మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఇన్‌వెస్ట్ ఏపీ నినాదంతో దావోస్ పర్యటనకు వెళ్లారు. ఈ తరుణంలో ఏపీ మంత్రి లోకేష్ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి కీలక సూచనలు చేశారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి లోనే కాదు, రాజకీయంగా మీ నుంచి సూచనలు చాలా అవసరం అన్నారు. ఒకవేళ మేం దారి తప్పుతున్నట్లు అనిపిస్తే.. సరైన దారిలో పెట్టే బాధ్యత కూడా మీ పై ఉంది.

ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మీరు సూచనలు చేయాలి అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉన్న వారిని మేం ‘NRIలుగా కాకుండా.. MRI (మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్)గా భావిస్తాం’ అని లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మా కోసం రెండు మూడు నెలల సెలవు పెట్టి పని చేసేందుకు మీరంతా కలిసొచ్చారు. ఈ తరుణంలో రాష్ట్రాభివృద్ధి(State Development) దృష్ట్యా కలసికట్టుగా పోరాడి సైకోను తరిమికొట్టాం. ఇప్పుడు మళ్లీ రాష్ట్రం కోసం పని చేయాల్సిన అవసరం వచ్చిందంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాని పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు.

Next Story