రప్పా రప్పా నరుకుతాం.. జగన్ పర్యటనలో వివాదాస్పద ఫ్లకార్డులు

by Ajay Maddhiboyina |

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడులోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.

రప్పా రప్పా నరుకుతాం.. జగన్ పర్యటనలో వివాదాస్పద ఫ్లకార్డులు
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడులోని రెంటపాళ్ల గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కాగా జగన్ పర్యటనలో కొందరు వివాదాస్పద ఫ్లకార్డులను ప్రదర్శించారు. పుష్ప సినిమా డైలాగులను ఫ్లకార్డులపై ప్రదర్శించారు. జగన్ వస్తాడు..అంతుచూస్తాడు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా గంగ‌మ్మ‌త‌ల్లి జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు న‌రుకుతం ఒక్కొక్కడిని అంటూ జ‌గ‌న్ ఫోటోల‌తో ఉన్న ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో మంత్రి నారా లోకేష్ సైతం ఫ్ల‌కార్డుల‌పై ఎక్స్ పోస్టులో స్పందించారు. య‌థా అధినేత‌..త‌థా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అని పేర్కొన్నారు. వైసీపీ సైకోల‌ను త‌యారు చేసే ఫ్యాక్ట‌రీగా మారింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టినా వైసీపీ ప‌ద్ధ‌తి మార‌లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసేలా వ్య‌వ‌హ‌రిచండం దారుణం అని ప్ర‌జాపాల‌న‌లో ఇలాంటి చ‌ర్య‌లను ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు.

Next Story