- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో కన్సల్టెన్సీ ఘరానా మోసం.. పట్టించుకోని పోలీసులు
నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ (Nagaraju Training And Consultancy) పేరుతో ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షలు వసూలు చేశారు నిర్వాహకులు.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఉద్యోగాల పేరుతో కన్సల్టెన్సీల మోసాలు (Consultancy Frauds) పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్ గచ్చిబౌలి (Gachibowli)లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైనింగ్ పేరుతో 200 మంది నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేయగా.. తాజాగా అలాంటి ఘటనే విజయవాడలో వెలుగుచూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను నట్టేట ముంచిందో కన్సల్టెన్సీ కంపెనీ. నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ (Nagaraju Training And Consultancy) పేరుతో ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షలు వసూలు చేశారు నిర్వాహకులు. జాబ్ గ్యారెంటీ అని నమ్మించి, కొద్దిరోజులు ట్రైనింగ్ ఉంటుందని మభ్యపెట్టారు. నిజమేననుకున్న బాధితులు ఉద్యోగం వస్తుందని రోజుల తరబడి ఎదురుచూడగా.. ఫలితం లేదు. కన్సల్టెన్సీ రెస్పాండ్ అవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






