పేదలు ఇబ్బంది పడకుండా ఇండ్ల నిర్మాణం : మంత్రి నారాయణ

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలు ఇబ్బంది పడకుండా టిడ్కో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు.

పేదలు ఇబ్బంది పడకుండా ఇండ్ల నిర్మాణం : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలు ఇబ్బంది పడకుండా టిడ్కో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అందరికీ ఇళ్లు అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో వేసిన కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committee) సమావేశానికి మంత్రి నారాయణ శుక్రవారం హాజరయ్యారు. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో భూ సంస్కరణల గురించి చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందన్నారు. గతంలో అయినా ఇప్పుడైనా పేదలకు ఇబ్బంది కలగకుండా ఇండ్ల నిర్మాణం చేస్తోందన్నారు. అందుకోసం భూసంస్కరణలను (Land reformations) తీసుకొచ్చి మరీ అమలు చేస్తోందని వివరించారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలోనే 7 లక్షల టిడ్కో ఇళ్ల (TIDCO Houses) నిర్మాణానికి అనుమతి తీసుకున్నామని స్పష్టం చేశారు. వాటిలో 5 లక్షల ఇళ్లకు పాలన అనుమతులు తీసుకొని నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ఆ తరువాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయన్నారు. ప్రభుత్వం మారడంతో టిడ్కో ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చిందన్నారు. అందుకే తమ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టాక పేదలు ఇబ్బంది పడకుండా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నిర్ణయించారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు వచ్చే ఏడాది జూన్ నెలాఖరులోగా 2,60,000ల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Next Story