- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడబిడ్డపై కుట్రలు చేశారు.. రౌడీయిజమే గెలిచింది: మాగంటి సునీత ఎమోషనల్
ఆడబిడ్డపై కుట్రలు చేశారని.. రౌడీయిజంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆడబిడ్డపై కుట్రలు చేశారని.. రౌడీయిజంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె కౌంటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. నాలుగైదు పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, రౌడీయిజం చేసి గెలిచిందని కామెంట్ చేశారు. దీనిని కూడా గెలుపు అంటారని తాను అనుకోవట్లేదని అన్నారు. తన భర్త గోపీనాథ్ (Gopinath) ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ల ఆటలు సాగలేదని అన్నారు. కాంగ్రెస్‌ది గెలుపు కాదని నైతికంగా తానే గెలిచానని తెలిపారు. కేసీఆర్ ప్రచారం చేయకపోవడం వల్ల తాము ఓడిపోయామని అనుకోవట్లేదని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో లోపల తమ పార్టీ నేతలను ర్యాగింగ్ చేశారని, తాము కట్టుకున్న చీరలపై కూడా చిల్లరగా మాట్లాడటం బాధ అనిపించిందని అన్నారు. ఇక జూబ్లీహిల్స్‌లో అప్పుడే రౌడీయిజం మొదలైందని పేర్కొన్నారు. ఇక ఉప ఎన్నిక నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాగంటి సునీత సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు.
READ MORE ....
Maganti Sunitha: జూబ్లీహిల్స్.. ఓటమి తర్వాత మాగంటి సునీత ఎమోషనల్ ట్వీట్






