- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు.. అన్న జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
జగన్ మావిగన్ జోకర్ అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిల అన్నారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రతిపాదనపై ఆమె ఎద్దేవా చేశారు..

దిశ, వెబ్ డెస్క్: జగన్(Jagan) మావిగన్(Mavigun) జోకర్ అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిల(Ys Sharmila) అన్నారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రతిపాదనపై ఆమె ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో రుషికొండను జగన్ మింగేశారని ఆరోపించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పాదయాత్రకు 23 ఏళ్లు అయిన సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బీజీపీ దత్తపుత్రుడిగా జగన్ ఎందుకు మారారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై RSS వాదులు దాడులు చేస్తుంటే YSR వారసుడుగా జగన్ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. వైఎస్ ఆశయసాధన కాంగ్రెస్‌తోనే సాధ్యమని షర్మిల చెప్పారు.
‘‘జగన్ YSR పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు. YCPలో నిజంగా YSR ఐడియాలజీ ఉంటే జగన్ CM అయ్యి కూడా YSR జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు?. మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే, పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి “ఓన్లీ క్యాష్” మాఫియా ఎందుకు చేశారు?.’’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.






