- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్యసాయి ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శం: వైఎస్ షర్మిల
సత్యసాయి ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి ట్రస్ట్(Sathya Sai Trust) ప్రపంచానికే ఆదర్శమని కాంగ్రెస్(Congress) పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) అన్నారు. సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు. ఈ మేరకు షర్మిల మాట్లాడుతూ కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ పుట్టపర్తి సత్యసాయి అని కొనియాడారు. అంతటి మహనీయుడి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని సూచించారు. ‘‘సత్యసాయి ప్రేమతత్వం విశ్వవ్యాప్తం. నిస్వార్థ సేవకు ఆయన నిలువెత్తు రూపం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ,అహింస, ఇవే బాబా గారు మనకు నేర్పిన జీవన సూత్రాలు. ఎన్నో రాష్ట్రాల ప్రజలకు సురక్షిత మంచినీరు, ఉచిత వైద్యం, విద్య , ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శం.’’ అని షర్మిల ట్వీట్ చేశారు.
Next Story






