మరో విముక్తి పోరాటం.. షర్మిల కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-28 09:10:14  IST  )

భారతదేశ దిక్సూచి కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు...

మరో విముక్తి పోరాటం.. షర్మిల కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ దిక్సూచి కాంగ్రెస్ పార్టీ(Congress Party) అని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో(Congress Party 141st foundation day Celebrates) ఆమె పాల్గొన్నారు. బ్రిటీష్ బానిస సంకెళ్ళను విముక్తి చేసి, దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం సాధించిందని తెలిపారు. నవ భారత నిర్మాణానికి పునాదులు వేసి, దేశాన్ని అభివృద్ధిలో అగ్రపథంలో నిలబెట్టిందన్నారు. త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పాలన వరకు దేశమంటేనే కాంగ్రెస్ అని చెప్పారు. నాడు కాంగ్రెస్ సారధ్యంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని, ఆ ఫలితమే నేటి అభివృద్ధి ఫలాలు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

‘‘త్యాగాల పునాదులపై దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెడితే, కాషాయ పార్టీ చెద పురుగులు తొలుస్తోంది. దేశ సహజ సంపదను తింటోంది. రాజ్యాంగాన్ని మార్చి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వక్రీకరిస్తుంది. వ్యవస్థలను బానిసలుగా చేసి నియంత పాలన చేస్తోంది. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లే భారతావనిని మతం ముసుగులో RSS వ్యవస్థ కలుషితం చేస్తుంది. అభినవ భారతంలో ఈ దేశానికి మరో స్వాతంత్ర్యం రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మరో విముక్తి పోరాటం చేయాల్సి ఉంది. దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే మత పిచ్చి గాళ్లను బంగాళాఖాతంలో కలపాల్సి ఉంది. ఆనాటి కాంగ్రెస్ శ్రేణుల త్యాగం, ధైర్యం ఆయుధాలుగా చేసుకొని బీజేపీ ముక్త్ భారత్ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉద్యమానికి సిద్ధపడాలి.’’ అని వైఎస్ షర్మిల పిలుపు నిచ్చారు.

Next Story