బనకచర్లకు అంగీకరిస్తే తెలగాణకు అన్యాయమే: కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ

by Vemula.Srinu Prasad |

లోక్‌సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

బనకచర్లకు అంగీకరిస్తే తెలగాణకు అన్యాయమే: కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభ(Lokhsabha) సాక్షిగా కేంద్ర ప్రభుత్వం(Union)పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చే ఉద్దేశంతోనే కేంద్రం ఈ కేటాయింపులకు అంగీకారం తెలిపిందని ఎంపీ వంశీ కృష్ణ విమర్శించారు.

మౌలిక సదుపాయాల కల్పనలోనూ..

మౌలిక సదుపాయాల కల్పనలోనూ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగుతోందని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 9 విమానాశ్రయాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త విమానాశ్రయాల కేటాయింపులో తెలంగాణను విస్మరించడం సరికాదన్నారు. విభజన హామీలను గాలికొదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక రాష్ట్రానికి కొమ్ముకాస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ నిలదీశారు.

Next Story