మళ్లీ ఇక్కడకు వస్తే.. : పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజ్ స్టార్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర‌రావుపై కేసులు నమోదు, అరెస్ట్ ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

మళ్లీ ఇక్కడకు వస్తే.. : పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఓ ప్యాకేజ్ స్టార్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Congress Mla Anirudh Reddy) అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర‌రావు(Professor Nageswara Rao)పై కేసులు నమోదు, అరెస్ట్ ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును విమర్శించే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. దమ్ముంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయాలని, ఆయన ఇంటి ముందు తాను నిలబడతామని, తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. భవిష్యత్తులో వైఎస్ జ‌గ‌న్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వైసీపీతో ఉంటాడేమో అనేది తనకు డౌట్ అని ఎద్దేవా చేశారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణోళ్లను అరెస్ట్ చేయాలని హైదరాబాద్ వస్తే గో బ్యాక్ ఆంధ్రా పిలుపునిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.

Next Story