- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరీ అధ్వాన్నం: వైసీపీ, కూటమిపై తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం
వైసీపీ, టీడీపీ కూటమి దొందూ దొందేనని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆరోపించారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ , టీడీపీ కూటమి రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులని , దొందూ దొందేనని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడలో మీడియా సమావేశంలో తులసి రెడ్డి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు, అరాచక, మద్యం , డ్రగ్ ,గంజాయి, బూతుల ఆంధ్ర ప్రదేశ్‌గా తయారు చేసి అధికారం కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుత కూటమి పాలనలో రాష్ట్ర పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారయిందని ఎద్దేవా చేశారు. పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లు తయారైందన్నారు. కేవలం 16 నెలల కాలంలో లక్షా యాభై వేల కోట్ల రూపాయల అప్పు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసిందన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో రూ. 15, 480 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని విద్యుత్ వినియోగదారుల మీద మోపి బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించిందని విమర్శించారు. మండలానికి నాలుగు మద్యం షాపులు ,40 బెల్ట్ షాపులు అన్నట్లు మద్యం పాలసీ తయారైందని విరుచుకుపడ్డారు. మూడు జోకర్లు , ఆరు కళావర్లు అన్నట్లు జూదం విచ్చలవిడిగా సాగుతుందన్నారు. హైస్కూల్లోకీ డ్రగ్స్. గంజాయి ప్రవేశించాయన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డలకు ఆడబిడ్డ నిధి , ఎస్సీ , ఎస్టీ , బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఈ హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని తులసిరెడ్డి విమర్శించారు.
‘‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అరటి , చీని, మామిడి , టమోటో, ఉల్లి , మిర్చి , పొగాకు ఇలా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి .యూరియా కొరత రైతులను వెంటాడుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం ద్వారా ప్రతిభావంతులకు ,పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది. కూటమిపాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయింది. ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ పథకాల కింద రూ. 6400 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. రెడ్ బుక్ అంటూ టిడిపి నాయకులు.. డిజిటల్ బుక్ అంటూ వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తులసి రెడ్డి పేర్కొన్నారు.






