- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటూ.. కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ ఎటాక్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన కమలం గూటికి చేరడంపై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. కిరణ్ కుమార్ డిసిషన్‌పై కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పార్టీ మాజీ వ్యవహరాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ సెటైర్ వేశారు. మరో ఎన్ పీఏ(నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) బీజేపీలో చేరిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. నేతలు జీవిత కాలం కాంగ్రెస్‌లోనే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి: బ్రేకింగ్ : నేడు కాషాయ కండువా కప్పుకోనున్న మాజీ సీఎం
Next Story






