- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతలు పెట్టొద్దు.. ప్రతి బిడ్డకు ఇవ్వాల్సిందే : వైఎస్ షర్మిల
“తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ అంటూ వైఎస్ షర్మిల విమర్శలు కురిపించారు. ..

దిశ, వెబ్ డెస్క్: “తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ అంటూ వైఎస్ షర్మిల విమర్శలు కురిపించారు. అంతేకాదు గత ముఖ్యమంత్రి జగన్‌కి వారసుడు నేటి సీఎం చంద్రబాబు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. గత YCP మోసాలను తూచ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ విధానమైందని మండిపడ్డారు. అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి YCP ప్రభుత్వం తల్లులను పచ్చిమోసం చేసిందని వ్యాఖ్యానించారు. ‘‘నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు చంద్రబాబు తల్లులను నయవంచన చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కోతల రాయుడు కోతలని ఎద్దేవా చేసిన చంద్రబాబునే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని విమర్శించారు. తల్లికి వందనంపై నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 87 లక్షల మంది బిడ్డలకి ఇవ్వాల్నారు. కోతలు పెట్టకుండా ప్రతి బిడ్డకు 15 వేలు జమ చేయాలన్నారు. కొర్రీలు పెట్టకుండా మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని విజయవాడలో వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






