- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu:తెలంగాణ, ఏపీ విద్యార్థులకు కంగ్రాట్స్
by Jakkula.Mamatha |
నీట్ యూజీ-2025 ఫలితాలు నిన్న(శనివారం) విడుదలైన విషయం తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: నీట్ యూజీ-2025 ఫలితాలు నిన్న(శనివారం) విడుదలైన విషయం తెలిసిందే. నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. ఈ క్రమంలో నీట్ యూజీ ఫలితాల్లో(NEET UG-2025) ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు.
దేశవ్యాప్తంగా 18వ ర్యాంకు సాధించిన తెలంగాణ(Telangana)కు చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్, 19వ ర్యాంకు సాధించిన ఏపీకి చెందిన దర్బా కార్తీక్‌రామ్‌లకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో మీ కృషి ఫలించింది. వైద్య వృత్తి కల నేరవేర్చుకోవాలనుకోనే ఆశావహులందరికీ ప్రేరణగా నిలుస్తుందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Next Story






