ఏపీ పోలీస్​.. కీపిటప్​!

by Thanuru Gopichand |

జార్ఖండ్​లోని రాంచీలో జరిగిన 68వ ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్​లో అత్యున్నత ప్రతిభ కనపరిని పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.

ఏపీ పోలీస్​.. కీపిటప్​!
X

దిశ డైనమిక్ బ్యూరో : జార్ఖండ్​లోని రాంచీలో జరిగిన 68వ ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్​లో అత్యున్నత ప్రతిభ కనపరిని పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలను పోలీసులు సాధించి రెండోస్థానంలో నిలిచారు. అంకితభావం, చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయడంలో విజయం సాధించాలని ఆయన సూచించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ డ్యూటీ మీట్​లో మన పోలీసులు అత్యున్నత ప్రతిభ కనపరిచారు. విజయం సాధించిన పోలీసులకు డీజీపీ హరీష్​కుమార్​గుప్తా అభినందనలు తెలిపారు. డీఐజీ కేకేఎన్​అంబురాజన్​ ఆధ్వర్యంలో క్రీడా బృందం అక్కడకు వెళ్లింది. క్రీడా బృందం నిన్న మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్​క్వార్టర్ట్సలో డీజీపీ హరీష్​కుమార్​గుప్తాను కలిసింది. మూడు స్వర్ణాలు సాధించిన ఎస్​ఐ కృష్ణమూర్తిని ప్రత్యేకంగా అభినందించారు. 18 రాష్ట్రాల పోలీసులు, 8 పారామిలటరీ విభాగాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పాల్గొన్నాయి. పతకాల పట్టికలో ఏపీ పోలీస్‌ విభాగం రెండో స్థానంలో, టీమ్‌ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది.

Next Story