- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన
రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఈ నెల(ఫిబ్రవరి) 23వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఈ నెల(ఫిబ్రవరి) 23వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు ఏపీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. 2023లో విడుదల చేసిన ఈ గ్రూప్–2 నోటిఫికేషన్ పై ఇటీవల హైకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్ -2 మెయిన్స్ ఎగ్జామ్ నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించే గ్రూప్-2 ప్రధాన పరీక్షను నిలువరించాలని అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో స్టడీ సెంటర్ల వద్ద తీవ్ర నిరసనకు దిగారు. ఈ క్రమంలో గ్రూప్-2 మెయిన్స్ రోస్టర్‌లో లోపాలు సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ లోపాల కారణంగా అనేక మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఎల్లుండి(ఆదివారం) జరిగే గ్రూప్-2 పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై స్పష్టత ఇవ్వాలని, కొత్తగా పరీక్ష నిర్వహించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిన్న ఇదే విషయమై హైకోర్టులోనూ విచారణ జరగ్గా, పరీక్ష వాయిదాకు న్యాయస్థానం మొగ్గు చూపలేదు.






