యూట్యూబర్ అన్వేష్ పై విశాఖ సీపీకి ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

యూట్యూబ‌ర్ నా అన్వేష్ పై మ‌రో కేసు న‌మోదైంది. అన్వేష్ హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌రుస్తూ వీడియోలు చేశాడ‌ని హిందూ సంఘాల నాయ‌కులు విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు.

యూట్యూబర్ అన్వేష్ పై విశాఖ సీపీకి ఫిర్యాదు
X

దిశ‌, వెబ్ డెస్క్: యూట్యూబ‌ర్ నా అన్వేష్ పై మ‌రో కేసు న‌మోదైంది. అన్వేష్ హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌రుస్తూ వీడియోలు చేశాడ‌ని హిందూ సంఘాల నాయ‌కులు విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. అన్వేష్ మాట్లాడిన వీడియోల లింకులు, మెయిల్ ఐడీల‌తో ఫిర్యాదు చేశారు. అన్వేష్ ను అరెస్ట్ చేయాల‌ని వెంట‌నే అత‌డి పాస్ పోర్ట్ సీజ్ చేసి ఇండియాకు రప్పించాల‌ని డిమాండ్ చేశారు. అయితే ఇప్ప‌టికే అన్వేష్ పై ఇదే విష‌యం మీద‌ హైద‌రాబాద్ స‌హా ప‌లు ప్రాంతాల్లో కేసులు న‌మోదయ్యాయి. సినీ న‌టి క‌రాటే క‌ల్యాణి సైతం అన్వేష్ ను అరెస్ట్ చేయాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అత‌డిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు అత‌డు మాత్రం ప్ర‌స్తుతం మ‌లేషియాలో ఉన్నాడు. మ‌లేషియా నుండి త‌ర‌చూ వీడియోలు చేస్తూ యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. సీతాదేవిపై పొర‌పాటున త‌ప్పుగా మాట్లాడాన‌ని దానిపై ఇప్ప‌టికే క్ష‌మాప‌ణ‌లు కోరాన‌ని చెబుతున్నాడు. కానీ దానినే ప‌ట్టుకుని కొంత‌మంది కుట్ర చేస్తున్నార‌ని చెబుతున్నాడు. గ‌తంలో త‌ను బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేయ‌డంతో అప్పుడు కేసులు న‌మోదైన‌వాళ్లు ఇప్పుడు టార్గెట్ చేస్తున్నార‌ని చెబుతున్నాడు.

Next Story