DCM పవన్ పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ సీఎం జగన్ పై పోలీసులకు ఫిర్యాదు

by Jakkula.Mamatha |

రాష్ట్రం(Andhra Pradesh)లో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leader) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

DCM పవన్ పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ సీఎం జగన్ పై పోలీసులకు ఫిర్యాదు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leader) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) ఆరోపిస్తున్నారు. సూపర్ సిక్స్(Super Six) హామీలు ఎప్పుడు అమలు చేస్తారని పలువురు వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ నిన్న(బుధవారం) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ సీఎం జగన్ పై జనసేన కార్యకర్తలు ఏలూరు జిల్లా(Eluru District) ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్(MPDO Office) ఎదుట నిరసనకు దిగారు. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’’ అని నిన్న వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story