- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Simhachalam Incident : సింహాచలం ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు
అక్షయ తృతీయను పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లాలో ప్రతిఏటా నిర్వహించే సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవాలలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం(Simhachalam Incident) తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అక్షయ తృతీయను పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లాలో ప్రతిఏటా నిర్వహించే సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవాలలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం(Simhachalam Incident) తెలిసిందే. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రమాద ఘటనపై విచారణ కమిషన్(Enquiry Commission) ను ఏర్పాటు చేస్తూ.. బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. మున్సిపల్ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటైంది.
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజనీర్ ఇం చీఫ్ వేంకటేశ్వరరావు ఈ కమిషన్ లో సభ్యులుగా ఉన్నారు. అలాగే ఈ కమిషన్ కు సివిల్ కోర్ట్ అధికారాలు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి దేవాదాయశాఖ ఆలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.






