- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపుతప్పి బైక్, డివైడర్‌ను ఢీ కొట్టిన కాలేజీ బస్సు
విద్యార్థులను బస్సులో కాలేజీకి తీసుకువెళ్తుండగా.. ఆ డ్రైవర్ కు గుండెపోటు (Heart Attack) వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులను బస్సులో కాలేజీకి తీసుకువెళ్తుండగా.. ఆ డ్రైవర్ కు గుండెపోటు (Heart Attack) వచ్చింది. బస్సుపై పట్టు కోల్పోవడంతో ఒక బైక్, డివైడర్ ను ఢీ కొట్టి ఆగింది. డ్రైవర్ స్పృహ కోల్పోయిన ఆ సమయంలో బస్సులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ కు సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన విజయవాడ నగర శివారు ప్రాంతమైన రామవరప్పాడు రింగ్ వద్ద చోటుచేసుకుంది.
మంగళవారం ఉదయం ఎస్ఆర్ కాలేజీకి (SR College) చెందిన స్టూడెంట్స్ తో డ్రైవర్ వీరాస్వామి బస్సులో గన్నవరం నుంచి గుణదలకు బయల్దేరాడు. రామవరప్పాడు రింగ్ వద్దకు రాగానే ఆయనకు గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి బైక్, డివైడర్ ను ఢీ కొట్టి ఆగింది. అక్కడే ఉన్న ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ సీఐ రమేష్ కుమార్, ఎస్సై రాజేశ్ లు వీరాస్వామికి సీపీఆర్ చేశారు. ఆయన కాస్త తేరుకోవడంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. కాగా.. బస్సు ఢీకొట్టడంతో టూ వీలర్ దారుడికి స్వల్ప గాయాలవ్వగా అతడికి చికిత్స చేయించారు.






