గుంటూరులో ఫస్ట్ టైమ్ కలకలం.. కేసు నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-19 13:54:05  IST  )

ఏపీలో తొలిసారి కొకైన్ కలకలం రేగింది..

గుంటూరులో ఫస్ట్ టైమ్ కలకలం.. కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో తొలిసారి కొకైన్(Cocaine) కలకలం రేగింది. ఇన్ని రోజులు గంజాయి(Marijuana), ఇతర మాదక ద్రవ్యాలు(Drugs) పట్టుబడినా ఈసారి ఏకంగా 8.5 గ్రాముల కొకైన్‌ను ఎక్సైజ్ పోలీసులు(Excise Police) గుర్తించారు. గుంటూరు శ్యామల నగరం(Guntur Syamala Nagar)లో ఎక్సైజ్ పోలీసులు రోజు వారీ తనిఖీలు నిర్వహించారు. అయితే కొందరు యువకులు కొకైన్ అమ్ముతున్నారని సమాచారం అందడంతో ఆరా తీశారు. అనుమాన్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చెకింగ్ చేయగా వారి వద్ద కొకైన్ ప్యాకెట్లు లభించాయి. దీంతో రాష్ట్రంలో తొలి కొకైన్ కేసును నమోదు చేశారు. వెంటనే విచారణను ముమ్మరం చేశారు. ఈ ‘కొకైన్ ఎలా వచ్చింది.. ఎవరు ఇచ్చారు. ఎవరెవరికి అమ్మారనే’ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గ్రాము కొకైన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందతుల నుంచి మొత్తం 7 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story