- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో పాము.. బంధిస్తుండగా స్నేక్ క్యాచర్ చేతిపై కాటు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) బంగ్లాలో నాగుపాము (Snake) దూరింది.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) బంగ్లాలో నాగుపాము (Snake) దూరింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. పామును పట్టుకునేందుకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ నాయుడు (TTD Retired Employee Ravindar Naidu) ఈవో బంగ్లా (EO bungalow)కు వచ్చారు. బంగ్లాలోని ఓ గదిలో దూరిన నాగుపామును వెతికి పట్టుకున్నారు. అనంతరం పామును గొనె సంచిలో బంధిస్తుండగా.. రవీందర్ నాయుడు చేతిపై కాటు వేసింది. దీంతో ఆయనను స్విమ్స్ ఆసుపత్రి (Swims Hospital)కి తరలించారు. స్నేక్ క్యాచర్ రవీందర్ నాయుడుని కాటు వేసింది విషనాగుగా డాక్టర్లు గుర్తించారు. ఆయనకు స్విమ్స్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
Next Story






