కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. భారీగా సబ్‌ కలెక్టర్ల బదిలీలు

by Kema Shiva Kumar |

పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. భారీగా సబ్‌ కలెక్టర్ల బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ర్టంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ (CS Vijayanand) ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్‌గా హిమవంశీ, మన్యం జిల్లా పాలకొండ సబ్ కలెక్టర్‌గా పవార్ సప్నిల్, ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్‌గా వినూత, అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్‌గా కళ్యాణి, రాజంపేట సబ్ కలెక్టర్‌గా హెచ్ఎస్ భావన, అల్లూరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా నోక్వల్, పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా ఆర్.వైశాలి నియమితులయ్యారు.

Next Story