- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం స్పెషల్ ఫోకస్
త్రిసభ్య కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేనున్న సీఎం చంద్రబాబు నాయుడు.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) రైతులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సీఎం భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌లతో కూడిన ఈ కమిటీ గత కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించి సేకరించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించనుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ పనుల వేగవంతంపై దిశానిర్దేశం చేయడంతో పాటు, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అమరావతిలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా జరీబు, మెట్ట భూముల వర్గీకరణలో ఉన్న వ్యత్యాసాలు, లంక భూముల రైతులకు ప్లాట్ల కేటాయింపు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాజధాని కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 1,286 ప్లాట్లకు సంబంధించి ఉన్న వీధి పోటు (వాస్తు) సమస్యలు, రోడ్డు అలైన్‌మెంట్ కారణంగా నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలు చెల్లింపుల వంటి సున్నితమైన అంశాలపై సీఎం సమీక్షించనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది.






