- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
No Kids Trend: పిల్లల్ని కనకుండా భార్యా,భర్తలు ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు.. CM షాకింగ్ కామెంట్స్
పెళ్లి, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుడితే జీవితం సంతోషంగా ఉంటుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుడితే జీవితం సంతోషంగా ఉంటుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇండియాలో కూడా ఫారెన్ కల్చర్(Foreign Culture) పెరిగిపోతోంది. పిల్లల్ని కని, వారిని పెంచి, పెళ్లిళ్లు చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తూ.. వచ్చిన సంపాదనతో హాయిగా ఎంజాయ్ చేయడానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. మొన్నటి వరకు ఫారెన్‌లో ఉన్న ఈ కల్చర్.. ఇప్పుడిప్పుడే దేశంలోని ప్రధాన సిటీలకు పాకింది. ప్రస్తుతం అనేక జంటలు పిల్లల్ని వద్దనుకొని ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా.. ఈ కల్చర్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదు. పాపులేషన్ తగ్గితే ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ బతికే వారి సంఖ్య పెరుగుతుంది. అదే ఇక్కడే పాపులేషన్ పెరిగితే.. మన సంఖ్య పెరగడంతో పాటు కొన్నేళ్లలో ప్రపంచాన్నే శాసించే పరిస్థితి వస్తాం. ముఖ్యంగా యువతకు ఒక కీలక సూచన చేయదలుచుకున్నాను.. కంఫర్ట్ జోన్‌కు వెళ్లకూడదు. భార్యా భర్తలమిద్దరం పనిచేస్తాం.. డబుల్ ఆదాయం వస్తుంది.. నో కిడ్స్, లెటజ్ ఎంజాయ్ అనే తీరుకొస్తున్నారు.. ఇది సరైంది కాదు.. ఇక ఈ విధానానికి స్వప్తి పలకండి అని పిలుపునిచ్చారు.
మీరంతా "పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, భార్యా భర్తలమిద్దరం పనిచేస్తాం, డబుల్ ఆదాయం వస్తుంది, నో కిడ్స్, లెటజ్ ఎంజాయ్" అనే తీరుకొస్తున్నారు..
— Telugu360 (@Telugu360) March 28, 2025
దాని వలన జనాభా తగ్గిపోతుంది
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. pic.twitter.com/BRhSJMQGe4






