- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్రలో వీరమల్లు లేడు, పవన్ రాజకీయ ప్రయోజనాల కోసమే సినిమా..సీపీఎం నేత ఫైర్
ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ సినిమా మొత్తాన్ని మార్చేశారని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఐదేళ్ల క్రితం సినిమా ప్రారంభించి రాజకీయ ప్రయోజనాల కోసం మార్చేశారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ఎస్ మతం పుచ్చుకున్న పవన్ సినిమా మొత్తాన్ని మార్చేశారని CPM Andhra Pradesh State Secretary Srinivasa Rao అన్నారు. ఐదేళ్ల క్రితం సినిమా ప్రారంభించి రాజకీయ ప్రయోజనాల కోసం మార్చేశారన్నారు. హరిహర వీరమల్లు సినిమా ఓ కల్పిత కథ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. అభిమానులు, ప్రజలు దీనిని ఓ చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారని, అపోహలతో కూడిన ఈ ఊహాజనిత చిత్రం ముస్లీం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుందని అన్నారు. మొగలులతో పోరాడి హరిహరవీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తీసుకువచ్చినట్టుగా కథకథలుగా సినిమా పేరుతో ప్రచారం జరుగుతోందన్నారు.
చరిత్రలో అసలు వీరమల్లు లేడని మొగలులు, కోహినూర్ వజ్రం ఆధారంగా ముస్లీం సమాజానికి వ్యతిరేకంగా సినిమా తీశారనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందిపోయి కల్పిత కథలను చరిత్ర కింద చూపించడం సరికాదన్నారు. కాబట్టి సినిమాలో, పోస్టర్లపై ఇది చరిత్ర కాదు కల్పిత కథ అని వేయాలని డిమాండ్ చేశారు. మొగలులు ఎన్నో అరాచకాలు చేశారని కానీ వాళ్ల సంపద అంతా ఇక్కడే ఉండిపోయిందన్నారు.
ఆఖరి మొగల్ చక్రవర్తికూడా బ్రిటీష్ వాళ్లతో కొట్లాడరని చెప్పారు. మొగల్ రాజులు చెడ్డవారు కాదని మంచివాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. ఆ వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా పవన్ ఇలాంటి సినిమాలు చేయవద్దన్నారు. పవన్ తన పలుకుబడి ఉపయోగించి మోడీతో మాట్లాడి కోహినూర్ ను లండన్ నుండి రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. అది చెప్పకుండా సంపద దోచుకున్న బ్రిటీష్ వాళ్ల గురించి చెప్పకుండా ముస్లీంలను శత్రువులుగా చూపిస్తే ఎవరూ అంగీకరించరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి పెట్టింది పేరని అస్సలు ఇలాంటివి అంగీకరించరని అన్నారు.






