“అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన” యాత్రలో పాల్గొనాలి : సీఎం

by Thanuru Gopichand |

డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రంలో అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన యాత్ర (Atal Sandesh - Modi Suparipalana Yatra) జరగనుంది.

“అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన” యాత్రలో పాల్గొనాలి : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రంలో అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన యాత్ర (Atal Sandesh - Modi Suparipalana Yatra) జరగనుంది. ఈ మేరకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్డీఏ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పకుండా యాత్రలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు (CM Chandra Babu) మాట్లాడుతూ వాజ్ పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ - మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు తెలియజేవారు. దేశంలో సుపరిపాలనకు నాంది పలికిన నాయకులు వాజ్ పేయీ అని అన్నారు. ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి పునాదులను వేశాయన్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాజ్ పేయీ దేశం గర్వింేచ నాయకులుగా ఎదిగారన్నారు. 9 సార్లు లోక్ సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చని అన్నారు. 18ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వతంత్ర సమరయోధులని కొనియాడారు. అంతేకాకుండా 1998లో పోఖ్రాన్2 అణు పరీక్షలను విజయవంతం జరిపి ప్రపంచానికి భారత శక్తిని చాటారన్నారు. కార్గిల్ యుద్ధంతో శత్రువుకు తిరుగులేని సమాధానం ఇచ్చారని చెప్పారు. వాజ్ పేయీ హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశం దశదిశను మార్చేసిందన్నారు.

వారిని చూస్తే అర్థమవుతుంది

సుపరిపాలన ఎలా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయీలను చూస్తే అర్థమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తనకు వాజ్ పేయీతో మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏ సహాయం అడిగినా కాదనేవారు కాదని తెలియజేవారు. వాజ్ పేయీ హయాంలో టెలీ కమ్యూనికేషన్, విమానయాన రంగాల్లో సంస్కరణలకు నాంది పలికారని వివరించారు. ప్రజలకు పనొచ్చే పనుల విషయంలో, పాలసీల రూపకల్పనలో త్వరగా నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినవారని, పట్టుదల, అనునిత్యం ప్రజలకు మంచి చేయాలని ఆలోచన కలిగి ఉండేవారని సీఎం తెలియజేశారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

విజయవంతమైన కార్యక్రమాలు

నాడు అణు పరీక్షలు అయినా, నేడు ఆపరేషన్ సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా, నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని సీఎం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారని వెల్లడించారు. 2047 నాటికి ఇండియా, ఇండియన్స్ నెంబర్ స్థానానికి వెళ్తారని జ్యోష్యం చెప్పారు. యువతరానికి మోదీ ఒక స్ఫూర్తినిస్తున్నారన్నారు. వాజ్‌పేయ్ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story