బాణసంచా పేలుళ్ల నివారణకు చర్యలు.. శివకాశీ అధ్యయనానికి సీఎం ఆదేశం

by Ramesh Naini |   (  Updated:2026-03-02 16:09:51  IST  )

బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

బాణసంచా పేలుళ్ల నివారణకు చర్యలు.. శివకాశీ అధ్యయనానికి సీఎం ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో తమిళనాడులోని శివ కాశీకి వెళ్లి అక్కడి భద్రతా ప్రమాణాలు, తయారీ విధానాలు, నియంత్రణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. సోమవారం ఆర్టీజీఎస్‌, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల పనితీరు మరింత సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ప్రజలకు అందుతున్న సేవల్లో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించారు.

అదనపు డబ్బులు వసూలు చేయకుడదు..

పింఛన్ల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతి గ్రామం, వార్డుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ‘దీపం’ పథకం కింద సిలిండర్ల డెలివరీ సమయంలో లబ్ధిదారుల నుంచి ఎలాంటి అదనపు డబ్బులు వసూలు చేయకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, ప్రయాణికులకు అందుతున్న సేవలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని బస్టాండ్లలోని శౌచాలయాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి పరిశుభ్రత ప్రమాణాలు పెంచాలని సూచించారు. కాగా, కాకినాడ జిల్లా వేట్లపాలెం లో ఇటీవల చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ఘటనతో సీఎం చంద్రబాబు, అధికారులు బాణసంచా తయారీ కేంద్రాలపై దృష్టిసారించారు. వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Next Story