- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్లకు జిల్లాలు కేటాయించిన సీఎం
టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్లకు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలు కేటాయించారు.

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్లకు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలు కేటాయించారు. ఆయా జిల్లాల కో ఆర్డినేటర్లు.. నేటి నుంచే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ల పరిధులలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు - కార్యకర్తల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారంపై.. తాజాగా నియమించిన జోనల్ కో ఆర్డినేటర్లు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కో-ఆర్డినేటర్ కు రెండు, మూడు జిల్లాలు కేటాయించారు.
బెందాళం అశోక్ కు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలు కేటాయించగా.. సుజయ్ కృష్ణరంగారావుకు కాకినాడ, అమలాపురం జిల్లాలను అప్పగించారు. అలాగే మంతెన వెంకట సత్యనారాయణరాజుకు చిత్తూరు, రాజంపేట, తిరుపతి జిల్లాలు, అరిమిల్లి రాధాకృష్ణకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు జిల్లాలు కేటాయించారు. ప్రత్తిపాటి పుల్లారావుకు నర్సాపురం, ఏలూరు, రాజమండ్రి, మద్దిపాటి వెంకటరాజుకు నెల్లూరు, ఒంగోలు జిల్లాలు.. పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డికి కర్నూల్, నంద్యాల, కడప, దమచర్ల సత్యకు అనంతపురం, హిందూపురం, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు, బీటీ నాయుడికి బాపట్ల, నరసరావుపేట జిల్లాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.






