అది అమలు కాకపోతే 2024 లో ఓట్లు అడగన్న జగన్.. మాటమీద నిబడ్డారా..?లేదా

by Disha Web Desk 3 |
అది అమలు కాకపోతే 2024 లో ఓట్లు అడగన్న జగన్.. మాటమీద నిబడ్డారా..?లేదా
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామాయణం మహాభారతం గురించి మాట్లాడిన ఓ వీడియో ని X లో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో రామాయణం లో రాముడు మాట మీద నిలబడ్డారు అందుకే అయన అన్ని కష్టాలు పాడాల్సి వచ్చింది. ఎవరైతే మాట మీద నిలబడి.. నిబద్దతతో నిజాయితీగా ఉంటారో అలంటి వాళ్ళే ఎక్కువ కష్టపడతారని పేర్కొన్నారు. అలానే మహాభారతం లోనూ మాట మీద నిలబడి నిజాయితీగా ఉన్నవాళ్ళే కష్టాలు అనుభవించారని వెల్లడించారు. అయితే ఎన్ని కష్టాలు వచ్చిన ఇచ్చిన మాట మీద నిలబడి.. నిజాయితీగా ఉంటారో చివరికి వాళ్ళే గెలుస్తారని తెలిపారు. రామాయణం, మహాభారతం లో జరిగింది ఇదే అని పేర్కొన్నారు.

ఆ దేవుడు ఎప్పటికైనా న్యాయాన్ని ధర్మాన్ని గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. కాగా ఈ వీడియో x వేదికలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియో కి స్పందించిన ఓ వ్యక్తి 2024 లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోతే ఓట్లు అడగను అన్నాడు.. మరి ఇప్పుడు మాట మీద నిలబడే నిబద్దత ఉందా..? అని కామెంట్ చేశారు. మరో వ్యక్తి రామాయణం గురించి చెప్పే సీఎం అయోధ్యకు ఎందుకు వెళ్లలేదని కామెంట్ లో ప్రశ్నించారు.. మరో మహిళ ఈ కలియుగ రామాయణం, మహాభారతంలో నూటికి నూరు శాతం విజయం ముమ్మాటికీ నీదే జగనన్న. ఈ రామరాజ్యం నీదే అంటూ కామెంట్ చేశారు. ఇలా ఈ వీడియో x వేదికలో వైరల్ గా మారింది.


Next Story

Most Viewed