ఎన్నికల వేళ వైరల్ అవుతున్న సీఎం జగన్ డిగ్రీ మెమో..మార్క్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Disha Web Desk 18 |
ఎన్నికల వేళ వైరల్ అవుతున్న సీఎం జగన్ డిగ్రీ మెమో..మార్క్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఇక వింతలు, విశేషాలకు కొదవ లేకుండా పోతుంది. ఫన్నీ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట చక్కర్లు కొడతాయి. ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కి రెండు రోజులే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత సీఎం జగన్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే..జగన్ ఏం చదివారో ఎక్కడ చదివారు ఎవరికీ తెలియదని పలు మార్లు ఆయన పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం సీఎం జగన్ డిగ్రీ మోమో వెలుగులోకి వచ్చింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంట. ఇంటర్‌, డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని తెలుస్తోంది. సీఎం జగన్ డిగ్రీకి సంబంధించిన మార్కుల మెమో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ డిగ్రీ సర్టిఫికెట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీఎం జగన్ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రగతి మహా విద్యాలయంలో డిగ్రీని పూర్తి చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఇంటర్ చదువుకున్నారు. కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా మూడేళ్లు డిగ్రీని పూర్తి చేశారు. అయితే జగన్‌కి డిగ్రీలో 740 మార్కులు వచ్చాయి. 1994 జూన్ 17న మార్కుల జాబితాని ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ కళాశాల జారీ చేసింది. ఈ మార్కుల జాబితాలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బిజినెస్ రిలేటెడ్ కోర్సులో డిగ్రీ చేసిన వైఎస్ జగన్ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Read More..

AP Elections 2024: ప్రగతి పథంలో కాదు పథకాల బాటలోనే నా పయనం.. సీఎం జగన్..


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed