- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మరోసారి జనాల్లోకి సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..!
సీఎం జగన్ మరోసారి జనాల్లోకి వెళ్లనున్నారు....

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మరోసారి జనాల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ స్పీడ్ మరింత పెంచారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల తరపున మేమంతా సిద్ధం సభలు, రోడ్ షోలు నిర్వహించిన ఆయన మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో ఆదే జోరును కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు మలి విడత ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. ప్రతి రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 28న ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నురులోనూ సభల నిర్వహించనున్నారు. 30న కొండపి, మైదుకూరు, పీలేరులో, మే1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్ రూట్ మ్యాప్ తయారు చేసింది.






