అలా చేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే.. ఎన్నికల వేళ CM జగన్ షాకింగ్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2024-05-04 14:35:44  IST  )

చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని సీఎం జగన్ చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు.

అలా చేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే.. ఎన్నికల వేళ CM జగన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని సీఎం జగన్ చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జగన్ పలమనేరులో మాట్లాడుతూ.. పొరపాటున చంద్రబాబుకు నమ్మి ఓటేస్తే మళ్లీ చంద్రముఖిని నిద్రలేస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన్ను నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు. ఇక పథకాల ముగింపు ఖాయమని తెలిపారు. లకలక అంటూ మీ తలుపు తడుతుందన్నారు. పేద విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చామని, విద్యాకానుక, గోరుముద్ద, అమ్మఒడి అందించామని, మహిళ పేరిట 31 ఇళ్ల స్థలాలు ఇచ్చామని జగన్ వెల్లడించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన గతంలో చూశారా? అని జగన్ ప్రశ్నించారు. అవ్వాతాలతకు రూ. 3 వేల పెన్షన్ గతంలో ఇచ్చారా? గతంలో ఇంటి దగ్గరే ఎవరైనా పెన్షన్ అందించేలా చూశారా? అన్నారు. సచివాలయాల్లో 600 రకాల సేవలు అందిస్తున్నామని జగన్ తెలిపారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని.. ఓటు వేసే ముందు ఆచితూచి వేయాలని కోరారు

Read More..

వైసీపీకి భారీ షాక్..ముగ్గురు మాజీ కార్పొరేటర్‌లు జనసేనలో చేరిక

Next Story