Ap Assembly: అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రసంగం

by Disha Web Desk 16 |
Ap Assembly: అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రసంగం
X

దిశ, వెబ్ డెస్క్:ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలను 90 శాతం నేరవేర్చామన్నారు. గత ప్రభుత్వ బడ్జెట్లు ఎవరికీ అర్థమయ్యేవికావని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి జరిగిన మంచి పనిని వివరిస్తున్నామన్నారు. తమ నైతికతకు, నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు.

దేశంలోనే తొలిసారి...

రైతులకు కోసం దేశంలోనే తొలిసారిగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నకు తోడుగా ఆర్బీకేలు ఉంటున్నాయన్నారు. గ్రామస్థాయిలో తీసుకొచ్చిన గొప్ప మార్పు ఆర్బీకేలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షా 34 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 600లకుపైగా గ్రామ సచివాలయాలు ఏర్పాుట చేసి సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలకు రూ.2.60 లక్షల మంది వాలంటీర్లు మంచి చేస్తున్నారు. పౌర సేవల్లో ఇది గొప్ప విప్లవమన్నారు.

రైతన్నలకు తోడుగా ఉంటున్నాం..

రాష్ట్రంలో ఎక్కడా భూవివాదాలకు తావులేకుండా అడుగులు వేస్తున్నామన్నారు. రైతన్నలను చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ గ్రామస్థాయిలోనే ఉందని చెప్పారు. 10,778 మంది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లు రైతలన్నలకు తోడుగా ఉన్నారని సీఎం జగన్ తెలిపారు.


Next Story