- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్
మాజీ సీఎం జగన్ (YS JAGAN) పల్నాడులోని రెంటపాళ్ల (RENTAPALLA) గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ (YS JAGAN) పల్నాడులోని రెంటపాళ్ల (RENTAPALLA) గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనం అని అన్నారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి ఏవీ లేవని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల వేళ తమకు అనుకూలమైన పోలీసులను నియమించుకున్నారని ఆరోపించారు.
కూటమిని గెలిపించుకునేందకు అన్యాయాలు చేశారని, ఆ విషయం ఈ ప్రాంతం వాళ్లందరికీ తెలుసని చెప్పారు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్ కాగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున జనసేన, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణలతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని అన్నారు. అక్కడ పోలీసులు ఆయనను ఘోరంగా అవమానించారని తెలిపారు. ఊరి విడిచి వెళ్లకుంటే రౌడీ షీట్ తెరుస్తామని సీఐ వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వాళ్ల ఇంటిపై దాడి చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఆయన కుటుంబం ఇంకా బాధలోనే ఉందని, చంద్రబాబు వీరి కుటుంబానికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.






