- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు మోసాల్లో పవన్ కల్యాణ్ పార్ట్‌నర్: సీఎం జగన్ తీవ్ర విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి అని.. ఇద్దరూ కలిసి జనాన్ని

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి అని.. ఇద్దరూ కలిసి జనాన్ని ఎలా మోసం చేయాలనే ఆలోచిస్తారు తప్ప జనం బాగు కోసం కాదు విమర్శలు గుప్పించారు. పవన్ జీవితం అంతా చంద్రబాబును మోయడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి 15 ఏళ్లు అవుతోందని.. ఇవాళ్టికి కూడా ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీకి అభ్యర్ధి లేరని.. గ్రామాల్లో జెండా మోసే కార్యకర్తలు కూడా లేరని ధ్వజమెత్తారు. ఇక, చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, మోసం, దగా, వంచనా గుర్తుకు వస్తాయన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా.. జనంలో ఉన్న ఒక్కటే అన్నారు.
Next Story






