- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
రైతులకు సీఎం గుడ్ న్యూస్
by Disha Web Desk 4 |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కాసేపట్లో సీఎం జగన్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. వైఎస్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధి డబ్బులను సీఎం పంపిణీ చేయనున్నారు. రైతుకు మంచి చేయాలనే తాపత్రయంతో పథకాలు రూపొందిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్న మిన్నగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నాలుగేళ్ల వరకు ఇస్తామని మేనిఫెస్టో చెప్పామని, కాని ఇప్పుడు ఐదేళ్ల వరకు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రతి రైతుకు రూ.54,000 ఇచ్చామన్నారు. ప్రతి రైతుకు రూ.5,500 అందించనున్నట్లు తెలిపారు. రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు రూ.31,000 కోట్లు పంపిణీ చేశామన్నారు. సీజన్ ముగిసే లోగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు.
Read more:
Next Story