- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రథ సప్తమి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం
ప్రత్యక్ష నారాయణుడికి ప్రజల పూజలు, నైవేద్యం సమర్పణ.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా నేడు రథ సప్తమి (Ratha Saptami).. మాఘ సప్తమి (Magh Saptami) వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సూర్య దేవుడికి (Lord Surya) ప్రత్యేక వంటకాలను వండి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ప్రజలు తెల్లవారుజామునే స్నానాలు చేసుకొని దేవాలయాలకు దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రముఖ దేవాలయాలు (Temples) భక్తుల రద్దీతో కిక్కిరిసి పోతుండగా.. ఇతర దేవాలయాలు భక్తుల తాకిడిది సందడిగా మారాయి. ప్రముఖలంతా ప్రజలు రథ సప్తమని శుభాకాంక్షలను తెలియజేస్తూ వారిపై సూర్య భగవానుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కూడా ప్రజలకు రథ సప్తమి శుభాకాంక్షలను తెలియజేశారు. సూర్యుడు అవతరించిన సూర్య జయంతిని పురస్కరించుకొని అందరి జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్య దేవుడిని స్మరించుకొని ప్రజలు ఆయురారోగ్యాలు పొందాలని ఆకాంక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ప్రజలకు రథ సప్తమని శుభాకాంక్షలను తెలిపారు. సూర్య భగవానుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడి జన్మదినమే రథసప్తమి అని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. సూర్య భగవానుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలుగు ప్రజలకు రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






