- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
సొంత నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో (Kuppam) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు (Development Works) శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు గుడుపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (Agasthya International Foundation) ప్రాంగణంలో టీచర్ ట్రైనింగ్ సెంటర్ (Teacher Training Centre) భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం కుప్పం మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ గ్రంథాలయంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ అందించే ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని (Aditya Birla Skill Development Center) సీఎం ప్రారంభించనున్నారు.
అక్కడి నుంచి చారిత్రక నేపథ్యం ఉన్న కంగుందికి చేరుకుని, అక్కడ చేపట్టిన హెరిటేజ్ సైట్ డెవలప్‌మెంట్ వర్క్స్‌ను, సాహస క్రీడా ప్రియుల కోసం ఏర్పాటు చేసిన బౌల్డరింగ్ పార్క్‌ను (Bouldering Park) ప్రారంభించనున్నారు. ఇదే క్రమంలో దేశభక్తిని చాటేలా కంగుందిలో ఏర్పాటు చేసిన వంద అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను (National Flag) సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఈ మూడు రోజుల పర్యటనలో సీఎం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు కుప్పంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.






