అనకాపల్లిలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌..ఏకంగా రూ.5,400 కోట్లతో

by velandi.Saikiran |   (  Updated:2026-04-23 05:34:49  IST  )

నేడు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్య‌టించ‌నున్నారు.

అనకాపల్లిలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌..ఏకంగా  రూ.5,400 కోట్లతో
X

దిశ‌, వెబ్ డెస్క్: నేడు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం చంద్ర‌బాబు. రూ.5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబస్ సంస్థ పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టు పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం చంద్రబాబు.

రూ.4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టు నిర్మించ‌నున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం రెండేళ్లలో పూర్తికానుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉపాధి అవకాశాలు ద‌క్క‌నున్నాయి. ఈ తరుణంలోనే, ఇవాళ‌ ఉదయమే 09.30 గంటలకు అమరావతి నుంచి అనకాపల్లి జిల్లా జెడ్. చింతువకు బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు. 11.20 గంటలకు రెన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Next Story