సీఎం చంద్రబాబు పర్యటన.. ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు

by Kema Shiva Kumar |

తిరుపతి (Tirupati)లోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ యూనివర్సిటీలో బాంబు బెదరింపు మెయిల్ కలకలం రేపుతోంది.

సీఎం చంద్రబాబు పర్యటన.. ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ యూనివర్సిటీలో బాంబు బెదరింపు మెయిల్ కలకలం రేపుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) పర్యటన కోసం యూనివర్సిటీ పరిధిలో హెలికాప్టర్ దిగేందుకు గాను అధికారులు హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ హెలిప్యాడ్‌ వద్ద ఐఈడీ బాంబులు పెట్టినట్లుగా యూనివర్సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విభాగానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన వర్సిటీ సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు బాంబ్, డాగ్ స్వ్కాడ్‌తో స్పాట్‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ సమీపంలో ప్రతి ఇంచు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వస్తువును యూనివర్సిటీకి దూరంగా తీసుకెళ్లి చెక్ చెస్తున్నారు.

Next Story