AP News:వైఎస్ జగన్ గుంటూరు పర్యటన పై సీఎం చంద్రబాబు స్పందన

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-20 13:38:39  IST  )

ఢిల్లీ(Delhi) సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) హాజరైన విషయం తెలిసిందే.

AP News:వైఎస్ జగన్ గుంటూరు పర్యటన పై సీఎం చంద్రబాబు స్పందన
X

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi) సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. మిర్చికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతోనే రైతులు నష్టపోతున్నారు అని చెప్పారు. మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం అన్నారు. కేంద్రం ముందు మరికొన్ని ప్రతిపాదనలు ఉంచాం.

రాష్ట్రంలో జల్‌జీవన్ అమలు గురించి చర్చించామని తెలిపారు. 93 కేంద్ర పథకాలను ఉపయోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద 25శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ICAR గైడ్‌లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా.. ధర నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. సాగు ఖర్చులను రియలిస్టిక్‌గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరామని.. రేపు(శుక్రవారం) సమావైశమై చర్చించిన తర్వాత దీనిపై క్లారిటీ ఇస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM YS jagan) గుంటూరు(Guntur) పర్యటన పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ వైఎస్ జగన్ ఉల్లంఘించారని తెలిపారు. ఈసీ(Election Commission) కంటే జగన్ గొప్పవారు కాదని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, పర్యటనకు రాకూడదని పోలీసులు జగన్‌కు ముందే చెప్పారని పేర్కొన్నారు. అయినా అక్కడకు వెళ్లి.. తనకు భద్రత కల్పించలేదని ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Next Story