Sankranti:‘పండుగ ఎఫెక్ట్’.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Sankranti:‘పండుగ ఎఫెక్ట్’.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ(Sankranti festival) వేళ అందరూ పల్లె బాట పడుతున్నారు. ఈక్రమంలో బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సొంతూళ్లకు ప్రయాణమవుతున్న ప్రజలకు ప్రయాణ కష్టాలు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సంక్రాంతికి పెద్ద సంఖ్యలో పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో ఈ సూచనలు చేశారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఆయా బస్సులను ముందుగా ఫిట్‌నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.

Next Story