CM Chandrababu Naidu : కొత్త ఇంట్లో సీఎం చంద్రబాబు గృహప్రవేశం

by Muthe.Rajitha |

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదివారం తెల్లవారుజామున కుప్పం నియోజకవర్గం(Kuppam Constituency)లోని శివపురంలో తమ కొత్త ఇంటిలో గృహప్రవేశం(House Warming) చేశారు.

CM Chandrababu Naidu : కొత్త ఇంట్లో సీఎం చంద్రబాబు గృహప్రవేశం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదివారం తెల్లవారుజామున కుప్పం నియోజకవర్గం(Kuppam Constituency)లోని శివపురంలో తమ కొత్త ఇంటిలో గృహప్రవేశం(House Warming) చేశారు. ఈ వేడుకలో ఆయన భార్య నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari), కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గృహప్రవేశం సందర్భంగా సంప్రదాయక పూజలు, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మీడియాతో సోషల్ మీడియాతో పంచుకున్నారు.

ఇందులో చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. భువనేశ్వరి స్వయంగా ఈ కొత్త ఇల్లు నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యులతో సన్నిహితంగా జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు ఎవరూ ఆహ్వానించబడలేదు. ఈ ఇంటిలో చంద్రబాబు సమావేశాల కోసం ప్రత్యేక గది, గ్రంథాలయం, వినోద సౌకర్యాలు, 20 కార్ల పార్కింగ్ స్థలం ఉన్నాయి. ఈ గృహప్రవేశం సందర్భంగా భువనేశ్వరి తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. "కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ...మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది. కల్మషం లేని మంచి మనుషుల మధ్య...మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకు ఎన్నటికీ గుర్తుండిపోతుంది. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను." అని రాశారు.

Next Story