- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణతో గొడవపై CM చంద్రబాబు హాట్ కామెంట్స్
బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవా(Handri-Neeva)కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. తెలంగాణతో గొడవ పడే అవసరం లేదని స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తామని తెలిపారు. గోదావరి నీళ్లు వాళ్లు వాడుకుంటున్నారు.. మనం వాడుకుంటామని వెల్లడించారు. ప్రధాని మోడీ కూడా నదులు అనుసంధానం చేయాలనుకుంటున్నారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. రాయలసీమ కరువు, కష్టాలు, ప్రజల బాధలు తనకు తెలుసని అన్నారు. సీమ చరిత్రను తిరగరాయాలని ఆనాడు ఎన్టీఆర్ కలలుగన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరే అని చంద్రబాబు గుర్తుచేశారు. ఆయన ఆశయాలను టీడీపీ నెరవేరుస్తోందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తమ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు. వైసీపీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకపోగా.. ప్రాజెక్టుల పేరిట నిధులు దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాజకీయాలు సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమలో అన్ని రకాల వనరులు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.






