సీఎం చంద్రబాబు బర్త్ డే.. బాలకృష్ణ స్పెషల్ విషెస్

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-20 10:53:47  IST  )

సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్పెషల్ విషెస్ తెలిపారు.

సీఎం చంద్రబాబు బర్త్ డే.. బాలకృష్ణ స్పెషల్ విషెస్
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ క్రమంలో ‘‘తెలుగు ప్రజల ప్రగతికి మార్గనిర్దేశకుడిగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శిల్పిగా, రాజకీయాల్లో నైతికతకు ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన దూరదృష్టి, అభ్యుదయ శీలమైన ఆలోచనలు, నిరంతర శ్రమ ప్రజల మేధో వికాసానికి మార్గం వేశాయి. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో విప్లవాత్మక మార్పులను చూచింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మీరు చూపిన దీక్ష ప్రతి తరానికి ప్రేరణ. ఈ పుట్టినరోజు సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు, మరింత ప్రజల ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Next Story