- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టర్ గారు ఈ షాపును పర్మినెంట్ చేయండి: చంద్రబాబు
అకస్మాత్తుగా చిన్న టీ షాప్ వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లి నిర్మాహకురాలని సర్ ప్రైజ్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District)లో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పర్యటించారు. ఈ క్రమంలో తాడికొండ మండలం పొన్నెకల్లు(Ponnekallu)లో అకస్మాత్తుగా ఓ చిన్న దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్న బుర్రా చిన్నమ్మాయితో మాట్లాడారు. కుటుంబం, జీవనోపాధిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి దుస్థితిని విని వారికి ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యం బాలేక పొలం పోలేక ఈ చిన్న టీ షాపు పెట్టుకున్నానయ్యా అని చెప్పడంతో చంద్రబాబు చలించిపోయారు. కలెక్టర్ గారు ఈ షాపు లాభంలేదని.. పర్మినెంట్ షాపు చేయండని సూచించారు. అలాగే ఆమె భర్తకి కావాల్సిన పెన్షన్ సదుపాయాలు చూడండని కలెక్టర్‌ను ఆదేశించారు
అంతకుముందు ఒకే కుటుంబానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడైన నవీన్ (40), మెకానిక్ షాపు నిర్వహించే ప్రవీణ్ (37), కార్పెంటర్ పని చేసే అశోక్ (35) లను కలిశారు. వారికి పక్కా ఇల్లు నిర్మించడమే కాకుండా అధునాతన పరికరాలు సమకూర్చుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పేదరిక నిర్మూలన దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. అందులో భాగంగా నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలోని పేద కుటుంబాల వారిని కలిసి మాట్లాడాను. పేదరికం నిర్మూలన కోసం నేను చేయాల్సిన కర్తవ్యం… pic.twitter.com/hHVLc21PUZ
— N Chandrababu Naidu (@ncbn) April 14, 2025






