- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: అన్ని వ్యవస్థలను సరిచేస్తున్నాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
వైసీపీ (YCP) పాలనలో ధ్వంసమైన అన్ని వ్యవస్థలను సరిచేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) పాలనలో ధ్వంసమైన అన్ని వ్యవస్థలను సరిచేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఈనెల 24న ఎపీ అసెంబ్లీ బడ్జెట్ (AP Assembly Budget) సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ ఆయన సచివాలయం (Secretariat)లో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనను ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదని అన్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. తాను నాలుగోసారి సీఎంగా పని చేస్తున్నానని తెలిపారు. పాలనలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ (YCP) ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయ్యాయని తెలిపారు.
చివరికి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా పక్కదారి పట్టించారని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను సరి చేస్తున్నామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-2047 (Swarnandhra-2047) డ్యాక్యుమెంట్ కూడా రూపొందించామని అన్నారు. అధికారులు కూడా పనుల్లో మరింత వేగం పెంచాలని.. పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. కేంద్ర బడ్జెట్ (Central Budget)ను అధ్యయనం చేసి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపటితో 8 నెలలు గడుస్తోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఈ భేటీలో పాలనా వ్యవహారాలు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఇతర అంశాలపై సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance), స్వర్ణాంధ్ర-2047 (Swarnandhra-2047) లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేసే చేశారు. సంక్షేమ పథకాల అమలు తీరు, సూపర్ సిక్స్ (Super Six)లోని ఇతర హామీలపైనా మంత్రులు, కార్యదర్శులతో చర్చించారు.






